5, సెప్టెంబర్ 2012, బుధవారం

ఇలాంటి గురువులు ఎంతమంది ఉంటారు...

మన జీవితంలో ఎంతో మంది దగ్గర చదువుకుంటాం , కాని అతి కొద్ది మంది మాత్రమె మనకు జీవితాంతం గుర్తుంటారు. మన మనసు ఫై చరగని ముద్ర వేస్తారు. నా జీవితములో అలా గుర్తుండిపోయే గురువులు ఇద్దరున్నారు. ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నానంటే అలాంటి  వారు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడంలేదు. ముందుగా ఇస్మాయిల్ సార్ గారి గురించి చెప్పాలి. ఈయన అసలు పేరు మా ఊర్లోనే చాలామందికి తెలియదు. అందరికి ఆయన ఉర్దూ సార్ గానే పరిచయం. 18 ఏండ్ల వయస్సులో టీచర్ గా మా ఊర్లో అడుగుపెట్టి పదవి విరమణ కూడా మా ఊర్లోనే చేసారు. మా ఊర్లో ఆయన చేత దెబ్బలు తినని వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమె ఉంటారు. మా నాన్నగారు, మా బాబాయి ,మా పెదనాన్న కూడా అయన చేత దెబ్బలు తిన్నవారే. సర్వీసు అంతా  ఒకే చోట పూర్తి చేయటం కూడా గొప్ప విషయమే. ఒక సారి ఆయన్ను వేరే ఊరు ట్రన్స్ఫెర్ చేస్తే మా ఊరివాళ్ళు డీ ఈ ఓ గారితో మాట్లాడి మల్లి మా ఊరికే పోస్టింగ్ ఇప్పించుకున్నారు. అలా అయన ఉద్యోగ జీవితం మొత్తం ఎలాంటి సౌకర్యాలు లేని మా పల్లెలోనే గడిపారు. ఎంతో మందికి విద్యాబుద్దులు నేర్పారు. ఇక రెండో వ్యక్తి శ్రీ కే నారాయణ గారు. మా ఊర్లో 8 సంవత్సరాలు  పని చేసి వెళ్లారు. ఆయన రాక ముందు మా ఊర్లో ఏడో తరగతి వరకు మాత్రమె ఉండేది . ఏడో తరగతి తోనే  చాలామంది  చదువులు  ఆగిపోతున్దేవి. అయన ఎంతో శ్రమపడి దాన్ని హై స్కూల్ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు మా ఊర్లో అందరు చదవుతున్నారు. చాల మంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇదంతా అయన చలవే. 

1 కామెంట్‌:

  1. పిల్లలని కొట్టే మాస్టారు, నా దృష్టిలో అంత గొప్ప టీచర్ కాదని నా వుద్దేశ్యం. లెక్కల మాస్టారైతే మామూలే, ఉర్దూ మేస్టారూ కొట్టడమేనా?! :(

    రిప్లయితొలగించండి