9, అక్టోబర్ 2013, బుధవారం

రియల్ స్టార్ భద్రాచలం



భద్రాచలం సినిమాలోని ఈ సన్నివేసం నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది . ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు బతుకు పోరాటాన్ని గుర్తుచేస్తుంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలోని ఇదే నా పల్లెటూరు అనే పాట సాహిత్యపరంగా ,చిత్రీకరణ పరంగా ఎంతో గొప్పగా ఉంటుంది . భద్రాచలం తిరునాళ్ళ పందెంలో  బస్తా వీపున వేసుకొని శ్రీ హరి పరుగుతీయడం, కాలికి ముల్లుగుచ్చుకొని రక్తం కారుతున్నా పరుగు ఆపకుండా గెలుపొందడం  మొదలైన సన్నివేశాలు బాగా గుర్తుండిపోయాయి . ఈ సినిమా చూసిన తర్వాత నుంచి నేను శ్రీహరి అభిమానినైపోయాను . హీరో అంటే ఇలా ఉండాలి అనేలా అయన కండలు తిరిగిన దేహంతో దృడంగా ఉండేవారు . అలాంటి శ్రీహరి గారు మరణిచారు అన్న వార్త నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను . ఆయన ఏ  లోకంలో ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను