6, అక్టోబర్ 2012, శనివారం

4, అక్టోబర్ 2012, గురువారం

పల్లె సజీవ చిత్రాలు






13, సెప్టెంబర్ 2012, గురువారం

నాగోబా జాతర

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరిగే నాగోబా  జాతర గిరిజనులు జరిపే అతి పెద్ద జాతర . గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా పేరు మీదుగా ఈ జాతరకు ఆ పేరొచ్చింది. ప్రభుత్వమే ప్రతియేటా ఈ జాతర నిర్వహిస్తోంది. 







ఓ కుశాలైన కొట్లాట

మొన్నామధ్య బస్సులో  శీశైలం నుంచి హైదరాబాదు పోతుంటే ఓ కుశాలైన కొట్లాట జరిగిందబ్బా . కొట్లాటంటే  తన్నుకున్నది, చొక్కాలు చిన్చుకున్నది కాదు గాని డైలాగులు మాత్రం చించి ఆరేశారు. అసలేమయిందంటే  నేనెక్కి కూసున్న ఆర్టీసీ బస్సు  శీశైలం దాటి సున్నిపెంట కాడికి వచ్చింది . అప్పుడికే  ఆడ శానా మంది  ఈ బస్సుకోసమని నిలబడున్నారు. బస్సు ఆడికొచ్చిందో లేదో  ఆడున్న ఆడా మగా జనమంతా బస్సుమీడికి కమరబడే. కొంతమంది ఉశారైన మొగోల్లయితే వాళ్ళ  పెళ్ళాం పిల్లల్ని ఆడే ఉంచి  బస్సు  కిటికీలపై ఎగబాకినారు .సదువు లేనోల్లైతే పై నున్న  తువాళ్ళు ,  సదువుకున్నోలైతే జోబిలోని  కచ్చీపులు కాలీగున్న సీట్లల్లో పడేసి అమ్మయ్య  ఎట్టగైతేనేమి సీటు  దొరికిన్చుకున్నములే అని కూసింత ఊపిరి పీల్చుకున్నారు.ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటే దిగేవాళ్ళు దిగుతుండే. అంతవరకు బాగానే ఉండాదబ్బా . అప్పుడ్నుంచే అసలు సినమా మెదలైనాది. ఒక సదువుకున్నాయన  పెళ్ళాం కోసమని  ఒక సీట్లో కచ్చీపు ఏసినాడు . అదే సీట్లో ఏరే ఒక సదువుకున్నయానా వాళ్ళ పెళ్ళాం మరదలు కోసమని కచ్చీపు ఏసినాడు .నేను ఆ సీటు యెనకనే ఉన్నాను  అయితే  ఫస్టు  ఎవరు  కచ్చీపు ఏసినారో  దేవుడి సాచ్చిగా  నాక్కూడా తెలియదబ్బా . ఇప్పుడేమయిందంటే ఫస్టు  కచ్చీపు ఎసినాయన ఆయన పెళ్లంతోపాటు వచ్చి కూసున్నాడు . అంతలోకే రెండో కచ్చీపు ఏసినాయన వాళ్ళ పెళ్ళాం మరదలిని తీసుకుని నేరుగా అదే సీటు దగ్గరికి వాచినాడబ్బా. రెండో మనిసి పెళ్ళాం మరదలు ఆ సీట్లో ఉన్నవాళ్ళను లెయ్యమని తగులుకున్నారు . మేము ముందు కచ్చీపు ఏసినామని వాళ్ళు తగులుకున్నారు. మొగోళ్ళు మొగోళ్ళు బాగానే ఉన్నరుగాని ఆడోల్ల గొంతులే అంతకంతకు పెరిగిపోయి కాకిగోలైపోయింది . ఎవురేం మాట్లాడుతున్నారో  అర్తంకావటం లేదుగాని  తుపాను తీరం దాటే  లెవల్లో వుండాదని మాత్రం నాకు అర్థమవుత వుండాది . సీట్లో కూచున్న మొగమనిసికి రోసమొచ్చి ఆడోల్ల పైకి కొట్టేమోయిన లేచాడు. వాళ్ళు ఊరుకుంటారా సాముల్లారా గొంతులు ఇంకాస్త పెంచేసినారు   . మేము ఆడోల్లం మమ్మల్నే కొట్టటానికి వస్తావా సీటేమన్నా మీ తాత సొమ్మా  అని ఇంకా రెచ్చిపోయే . అవతలున్న మగోనికి  ఓపిక  సచ్చినట్టున్నది  "గొందురు కప్పల్లా అంత నోరేసుకొని అరుస్తున్డారు మీరు ఆడోల్లా, ఛ ! ఆడ జాతికే అవమానం అంటూ పెళ్ళాన్ని తీసుకుని సక్కా బస్సు దిగిపోయిండు .ఆ డయిలాగిన్న నేను నవ్వాపుకోలేక  కిసుక్కున నవ్వితిని .ఆ మాటలు బడ్డ ఆడామె నాపై గుడ్లురిమే . చచ్చాన్రో దేవుడా ఇప్పడు నా మీద కమరబడతదేమోనని నాకు బిత్తరబుట్టే. ఆ మల్లన్నను తలచుకుంటూ తల ఆవైపుకు తిప్పుకున్నాను.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మైసూరు లో ఈ రాజభవనం చూశారా ?

మైసూరు  palace కు దగ్గరలోనే నజారాబాద్ లో ఈ రాజభవనం ఉంది. ఇది పోస్టల్ డిపార్టుమెంటు ట్రైనింగ్ సెంటర్.  






ఈ ఫోటో కు కాప్షన్ చెప్పండి



POSTAL ASSISTANT ONLINE APPLY చేయు విధానం


postal assistant jobs recruitment  జరుగుతుంది. అప్లికేషన్స్ shortage  వల్ల online  registration  సదుపాయం  కల్పించారు.అయితే రద్దీ ఎక్కువగా ఉండడంవలన  మెయిల్ రావడం కొంత ఆలస్యం అవుతుంది.

ముందుగా www.indiapost.gov.in కు వెళ్ళండి. స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. 
register- online అనే రెండో option click చేయండి. అప్పుడి స్క్రీన్ ఇలా కనిపిస్తుంది.
మీ వివరాలు నింపిన తర్వాత  మీ e-mail కు అప్లికేషను పంపిస్తారు. దాన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.అప్లికేషను మీద మీరు ఇచ్చిన పేరు, పుట్టిన తేది ప్రింట్ అయి వస్తుంది. కావున మీ వివరాలు జాగ్రతగా నింపండి. ఇలా అప్లికేషను ప్రింట్ తీసుకున్నవారు exam fee rs. 200  తో పాటు  application fee rs.50 కలిపి మొత్తం rs.250 చెల్లించాలి .

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

నేల తల్లి ఒడిలో అన్నదాతలు


నేల తల్లి ఒడిలో అన్నదాతలు 





పడమటి సంధ్యా రాగం




శ్రీశైల ముఖద్వారం

దోర్నాల లోని  శ్రీశైల ముఖద్వారం ఇది .ఇక్కడి నుండి శ్రీశైలం 49 k.m ఉంటుంది . దోర్నాల  నుండి 3 k.m వెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్డు ప్రారంభమవుతుంది. గుంటూరు , ఒంగోలు ,కర్నూలు, నాగార్జున సాగర్ ప్రాంతాలనుంచి వచ్చేవారు ఈ ముఖద్వారం గుండానే శ్రీశైలం వెళ్తారు. 



Postal Assistant పరీక్ష విధానం

postal assistant/ sorting assistant  పరీక్ష విధానం 
పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. 
1.రాత పరీక్ష 
100 questions-100 marks-  2 hrs(i.e 120 minutes),
no negative marking
General Knowledge& current affairs - 25 questions
arithmentic- 25 questions
Reasoning- 25 questions
English grammar - 25 questions
minimum qualifying marks in each category
OC - Over all 40% ( 10 marks in each part)
OBC- over all 38% ( 9 marks in each part)
SC/ST- over all 33% ( 8 marks in each part)
రాత పరీక్ష లో qualify అయిన వారిలో 1:5 నిష్పతి లో  
computer typing test కు పిలుస్తారు .
2. computer typing test 
30 నిముషాలపాటు జరుగుతుంది . రెండు దశలు గా జరుగుతుంది 
మొదటి 15 నిముషాలు  speed టెస్ట్
( 450 పదాలున్న English passage ని 15 నిముషాల్లో టైపు చేయాల్సి వుంటుంది.)
అంటే కనీస స్పీడ్  నిముషానికి 30 పదాలు టైపు చేయగలిగే సామర్ధ్యం ఉండాలి .
మరో 15 నిముషాలు data entry test ఉంటుంది. 
అంటే మనకు ఇచ్చిన పదం ఎలా ఉంటుందో అలాగే టైపు చేయాలన్నమాట 
example : EPnS2,ugH.nsL;7p
ఇలా ఇచ్చిన పదాన్ని అలాగే టైపు చేయాలన్నమాట.
final merit list
రాత పరీక్ష మరియు టైపింగ్ టెస్టు రెండింటి మార్కులు కలిపి final list prepare చేస్తారు.
ఇంటర్వ్యూ  లేదు. 

6, సెప్టెంబర్ 2012, గురువారం

సొగసు చూడ తరమా

ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శించినపుడు నా మొబైల్ తో తీసిన ఫోటోలు 




నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు శుభవార్త 
postal assistant/sorting assistant recruitment in indian postal  department notification వెలువడింది .
ఇంటర్తోనే central government job పొందే గొప్ప అవకాశం .
ఇంటర్లో 60 శాతం మార్కులు ఉన్నవారు ఎవరైనా అప్లై చేయవచ్చు. 
application cost ; rs.50
exam fee ; rs.200
no exam fee  for SC/ST/Female . 
last date for sale of applications ; 25-09-2012.
last date for submission of applications; 01.10.2012.
selection procedure;
1. written test - 100 marks
2. computer typing test
applications online ద్వారా పొందవచ్చు. పూర్తి వివరాలకు ఇదే బ్లాగు లోని నా పాత పోస్ట్ చూడండి. 

postal assistant division wise vacancies

postal assistant/sorting assistant  jobs division wise vacancies 




5, సెప్టెంబర్ 2012, బుధవారం

POSTAL ASSISTANT APPLY ONLINE

postal assistant jobs recruitment  జరుగుతుంది. అప్లికేషన్స్ shortage  వల్ల online  registration  సదుపాయం  కల్పించారు.అయితే రద్దీ ఎక్కువగా ఉండడంవలన  మెయిల్ రావడం కొంత ఆలస్యం అవుతుంది.

ముందుగా www.indiapost.gov.in కు వెళ్ళండి. స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. 

register- online అనే రెండో option click చేయండి. అప్పుడి స్క్రీన్ ఇలా కనిపిస్తుంది.



మీ వివరాలు నింపిన తర్వాత  మీ e-mail కు అప్లికేషను పంపిస్తారు. దాన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.అప్లికేషను మీద మీరు ఇచ్చిన పేరు, పుట్టిన తేది ప్రింట్ అయి వస్తుంది. కావున మీ వివరాలు జాగ్రతగా నింపండి. ఇలా అప్లికేషను ప్రింట్ తీసుకున్నవారు exam fee rs. 200  తో పాటు  application fee rs.50 కలిపి మొత్తం rs.250 చెల్లించాలి .

ఇలాంటి గురువులు ఎంతమంది ఉంటారు...

మన జీవితంలో ఎంతో మంది దగ్గర చదువుకుంటాం , కాని అతి కొద్ది మంది మాత్రమె మనకు జీవితాంతం గుర్తుంటారు. మన మనసు ఫై చరగని ముద్ర వేస్తారు. నా జీవితములో అలా గుర్తుండిపోయే గురువులు ఇద్దరున్నారు. ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నానంటే అలాంటి  వారు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడంలేదు. ముందుగా ఇస్మాయిల్ సార్ గారి గురించి చెప్పాలి. ఈయన అసలు పేరు మా ఊర్లోనే చాలామందికి తెలియదు. అందరికి ఆయన ఉర్దూ సార్ గానే పరిచయం. 18 ఏండ్ల వయస్సులో టీచర్ గా మా ఊర్లో అడుగుపెట్టి పదవి విరమణ కూడా మా ఊర్లోనే చేసారు. మా ఊర్లో ఆయన చేత దెబ్బలు తినని వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమె ఉంటారు. మా నాన్నగారు, మా బాబాయి ,మా పెదనాన్న కూడా అయన చేత దెబ్బలు తిన్నవారే. సర్వీసు అంతా  ఒకే చోట పూర్తి చేయటం కూడా గొప్ప విషయమే. ఒక సారి ఆయన్ను వేరే ఊరు ట్రన్స్ఫెర్ చేస్తే మా ఊరివాళ్ళు డీ ఈ ఓ గారితో మాట్లాడి మల్లి మా ఊరికే పోస్టింగ్ ఇప్పించుకున్నారు. అలా అయన ఉద్యోగ జీవితం మొత్తం ఎలాంటి సౌకర్యాలు లేని మా పల్లెలోనే గడిపారు. ఎంతో మందికి విద్యాబుద్దులు నేర్పారు. ఇక రెండో వ్యక్తి శ్రీ కే నారాయణ గారు. మా ఊర్లో 8 సంవత్సరాలు  పని చేసి వెళ్లారు. ఆయన రాక ముందు మా ఊర్లో ఏడో తరగతి వరకు మాత్రమె ఉండేది . ఏడో తరగతి తోనే  చాలామంది  చదువులు  ఆగిపోతున్దేవి. అయన ఎంతో శ్రమపడి దాన్ని హై స్కూల్ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు మా ఊర్లో అందరు చదవుతున్నారు. చాల మంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇదంతా అయన చలవే. 

29, ఆగస్టు 2012, బుధవారం

NH-7(NOW NH-44) at ADILABAD